కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి నేటిధాత్రి
పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 469 మంది కల్యాణలక్ష్మి షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,69,54,404 విలువైన చెక్కులను రేగొండ రైతువేదిక, చిట్యాల రైతువేదిక గణపురం జీపీ కార్యాలయ ప్రాంగాణంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు వరంగా మారాయని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని, ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడు అంకుశాపురం గ్రామ సర్పంచ్ తోట సునీత వినయ్ సాగర్. గట్టయ్య తదితరులు పాల్గొన్నారు
