మహిళలను అన్ని రంగా లల్లో అభివృద్ధికై ప్రభుత్వం కృషి
సర్వే జరుగుతున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
–
ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి ప్రజ్వల్ సంఘం ఆధ్వర్యంలో మహిళ లకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన వారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది. మహిళలను అన్ని రంగాలల్లో అభివృద్ది చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు తెలిపారు.వారి నిర్వహణలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్న ట్లు తెలిపారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేసి వారితో గ్రూపు ఫొటో దిగారు.
లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలి
ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నాలుగు కొత్త పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. పెద్దకోడెపాక గ్రామంలో నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కు సంబందించి ఫీల్డ్ వెరిఫికేషన్ ను స్వయంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి, గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఫీల్డ్ విజిట్ ను పరిశీలించి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా, లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో నాలుగు పథకాలకు సంబంధించి సర్వే జరుగుతున్న విషయం ముందస్తు సమాచారం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అక్కడున్న ఎంపీడీవో ఇతర అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడగ్గా, పొంతన లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. వెంటనే హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎంపీడీవో పని తీరు సరిగా లేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న నాలుగు పథకాలల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, క్షేత్రస్థాయిలో గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకొని వివరాలను సేకరించాలని అక్కడున్న అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్ర మంలో మండలంలోని కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ అభిమానులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.