జిల్లా బాలల పరిరక్షణ శాఖ విభాగంలో నిధుల దుర్వినియోగం

# విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.

# ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ ద్వారా లేఖ.

# స్పందించి సంబంధిత జిల్లా కేంద్రంలో గల జిల్లా కార్యాలయానికి ఆదేశించిన ముఖ్యమంత్రి కార్యాలయం.

నర్సంపేట / వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

*వరంగల్ జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల పరిరక్షణ శాఖ విభాగంలో నిధులు దుర్వినియోగం జరుగుతున్నది.కొందరు ఫీల్డ్ స్టాఫ్ వారు నిర్వర్తించే వృత్తి పట్ల విధులకు హాజరుకాకున్నా ఫీల్దుకు వెళ్ళినట్లుగా సృష్టించి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.అదే విభాగంలో పనిచేసే కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి పనులు చేసినట్లు వారికి సపోర్టుగా రిపోర్టులు రాయడం పట్ల కార్యాలయంలో గందరగోళ నెలకొన్నది. వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సేవలందించే కొంతమంది ఉద్యోగుల కంటే మామూలు ఆశలు చూస్తూ ఉన్నత అధికారుల మెప్పులు పొందే కొందరి ఉద్యోగులదే ఆ బాలల పరిరక్షణ విభాగంలో పలుకుబడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో నిజాయితీగా పనిచేసే కొందరు ఉద్యోగులు ఆ అక్రమార్కుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేక పంపారు. దానిని పరిశీలించిన రాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారులు వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా బాలల సంరక్షణ విభాగంలో జరుగుతున్న అక్రమాలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పట్ల పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడానికి అధికారుల సిద్ధమైనట్లు సమాచారం.*

వరంగల్ జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగంలో అక్రమాలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని కోరుతూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గత నెల 24 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేక పంపారు.లేక ద్వారా పంపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో కొంతమంది ఫీల్డ్ స్టాప్ ఉద్యోగులు వారు నిర్వర్తించే ఫీల్డ్ విధులకు వెళ్లకుండానే కార్యాలయంలో నిర్వహించే వర్క్ రిపోర్ట్ లో ఫీల్డ్ కు పోయినట్లు రాసుకొని అక్రమంగా టిఏలు నిధులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ వాహనం ఉన్నప్పటికీ వీరు ప్రభుత్వ వాహనం ఉపయోగిస్తూ అదే సమయంలో పూర్తి టి.ఏ లు తీసుకోవడంతోపాటు ఆ వాహనాన్ని సొంత పనులకు ఉపయోగించుకుంటూ పిల్లల రిస్క్యూకు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.కొంతమంది ఫీల్డ్ స్టాప్ ఫీల్డ్ కు నెలకు 3 నుండి 5 రోజులు మాత్రమే ఫీల్డ్ కు వెళ్లిన అలాగే వెళ్లకపోయినా మీ టి ఏ నుండి 50 శాతం ఇస్తే పూర్తి టిఏ ఇప్పిస్తానని డిసిపిఓ ఇన్చార్జి తీసుకున్నప్పటి నుండి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధులు నిర్వర్తించని వారు ఫేక్ బిల్లులు అక్రమంగా ప్రభుత్వ నిధులను తీసుకుంటున్నారని ఈ విషయం పట్ల మిగతా సిబ్బంది అడిగితే నా ఇష్టం నేను చెప్పినట్లు వినకుంటే మీ జాబు పోతుంది నాకు మినిస్టర్ సపోర్టు ఉంది అని బెదిరిస్తున్నారని అలాగే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేక ద్వారా సీఎంకు వెళ్ళబుచ్చుకున్నారు. అదేవిధంగా కొందరు ఫీల్డ్ స్టాప్ సమయపాలన పాటించకుండా ఉదయం రిజిస్టర్లో సంతకం చేసి లొకేషన్ పెట్టి కార్యాలయం నుండి బయటకు వెళ్లి వారి పర్సనల్ పనులను చేసుకుని సాయంత్రం 6 గంటలకు వచ్చి అదే కార్యాలయంలో ఉన్నట్టుగా లొకేషన్ పెట్టిపోవడంలాంటిది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమయపాలన పాటించని వారి పట్ల డిసిపిఓ ను అడిగితే నా ఇష్టం అంటూ అడిగిన వారిని బెదిరిస్తున్నారని వాపోయారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు పట్ల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోకుండా కంప్లైంట్ చేసిన వారిని ఇబ్బందులకు గురి చేస్తూ అన్యాయంగా మేము జారీ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లేక ద్వారా వాపోయారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు వారు కార్యాలయంలో ఉన్న ఫీల్డ్ కు వెళ్లిన వాట్సాప్ లోకేషన్ ఫోటో షేర్ చేస్తారు కావున వారు పోస్ట్ చేసినటువంటి లొకేషన్ మరియు ఫోటోలను తనిఖీ చేసి వారు ఎన్ని రోజులు ఫీల్డ్ కి వెళ్లారు నిర్ధారించి గత 18 నెలలుగా అక్రమంగా తీసుకున్న టి.ఏలు అక్రమ సొమ్ము దుర్వినియోగం కాకుండా అరికట్టాలని వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి పోస్ట్ లేక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

*స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం..*

*విచారణ చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారికి ఆదేశాలు జారీ.*

జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి రిజిస్టర్ పోస్టు ద్వారా కోరారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వరంగల్ జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయంలో విచారణ చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఈ విషయం పట్ల జిల్లా సంక్షేమ అధికారి హైమావతిని వివరణ కోరగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విచారణ చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మరల ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందజేస్తామని డిడబ్ల్యుఓ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!