నేటిధాత్రి కథనం,తో ఉద్యోగుల పై “ఆ అధికారి” ఆగ్రహం.!?
ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?
నేను మీ బాస్,మీకు ఉద్యమం నుండి తొలగిస్తా అంటూ సీరియస్.!?
అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?
ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?
ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?
ఆ అధికారి బండారం బయటకు వచ్చిన ఉన్నత అధికారులు స్పందన కరువు ఎందుకు.!?
మహాదేవపూర్-నేటిధాత్రి:
నేటి రాత్రి దినపత్రిక ప్రచురించిన “అవినీతికి పాల్పడితేనే, సై లేదంటే విజిలెన్స్ దాడులు.” అనే శీర్షికపై మండలంలోని ఆ శాఖ అధికారి తన సిబ్బందిపై విరుచుక పడినట్లు సమాచారం. శాఖలోని విభాగాలకు సంబంధించిన బాధ్యతలను విధుల నుండి తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా శాఖలో జరిగే వ్యవహారం బయటకు ఎలా వెళ్లిందని సిబ్బందితోపాటు శాఖలోని విభాగాలకు సంబంధించిన పలువురిని ప్రత్యేకంగా మీరే చెప్పారంటూ వార్నింగ్లు ఇవ్వడం జరిగిందని, ఇదే క్రమంలో ఆ అధికారి ప్రత్యేకంగా కొందరు శాఖలోని ఉద్యోగులతో పాటు విభాగాలకు సంబంధించిన బాధ్యులపై మరింత ఒత్తిడి పెంచినట్లు విశ్వ నీ సమాచారం. ఆ శాఖ అధికారి వ్యవహారం తిర పైకి వచ్చినప్పటికీ కూడా ఉన్నత అధికారులు విచారణ జరిపించకపోవడం అధికారిపై చర్యలు తీసుకోకపోవడం శాఖలోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?
మండలంలోని ఆ శాఖ అధికారి వ్యవహారం సొంత శాఖలో విజిలెన్స్ దాడులు, అవినీతికి పాల్పడకుంటే సిబ్బందితోపాటు, విభాగాల బాధ్యులపై కక్ష సాధింపుతో విజిలెన్స్ దాడులు ఉద్యోగం నుండి వెళ్లిపోయేలా హింసించడం, ఆ అధికారికి గత కొన్ని నెలలుగా మహాదేవపూర్ మండల ఆ శాఖ సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు హింసను తట్టుకోలేకపోతున్న క్రమంలో విజిలెన్స్ దాడులు తెరపైకి రావడం ఆ శాఖ అధికారి వ్యవహారం అంతర్గతంగా మండలమంతా ఇతర శాఖల్లో కూడా చర్చనీయంగా మారడంతో, నేటి ధాత్రి ఆదివారం రోజు,” అవినీతికి పాల్పడితేనే సై లేదంటే విజిలెన్స్ దాడులు” అనే శీర్షికను ప్రచురించింది. ఆదివారం శీర్షిక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న క్రమంలో ఆ శాఖ అధికారి వ్యవహారమంతా ఆ శీర్షికలో ఉండడం తన శాఖ తన గురించి ఇలా బయటికి వచ్చిందని,ఆదివారం సెలవు రోజు తన మొబైల్ ఫోన్ ను పనిలో పెట్టడం చేశాడట అధికారి, కిందిస్థాయి ఉద్యోగులతో పాటు శాఖలోని ఇతర విభాగాల బాధ్యులకు ఫోన్ ద్వారా వార్నింగ్ లు ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం. తనకు ఏమనుకుంటున్నారు, మీ శాఖ అధికారిని అంతర్గత వ్యవహారం ఏలా బయటికి పొక్కింది, నేను ఏమైనా చేస్తా మీరు ఎలా సమాచారం బయటకి చెప్తారు, ఉద్యోగం పై ప్రేమ లేదా, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని సిబ్బంది మరియు, ఆ శాఖలోని విభాగాల బాధ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం తో ప్రస్తుతం శాఖలోని కిందిస్థాయి సిబ్బంది తమపై అన్యాయాలు చేసి అవినీతికి పాల్పడాలి అనే అధికారి తమకు ఉన్నత అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకుంటున్నట్లు సమాచారం.
అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?
ఆ శాఖ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కింది స్థాయి ఉద్యోగులకు శాఖలోని ఇతర విభాగాలకు సంబంధించిన బాధ్యులకు, కచ్చితంగా అవినీతి చేసి తమ వాటా ఇవ్వాలని ఒత్తిడి తట్టుకోలేక ఆ శాఖకు సంబంధించిన కొందరు బాధ్యులు కిందిస్థాయి ఉద్యోగులు బదిలీ చేసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అలాగే మరికొందరు ఉద్యోగులు సైతం తమ రిటైర్మెంట్ కాలం దగ్గర ఉందని అధికారి ఒత్తిడికి చెప్పుకోలేక విధులు నిర్వహిస్తున్నట్లు, మరికొందరు అధికారిని ప్రశ్నించే సత్తా ఉన్నప్పటికీ పై అధికారులు కూడా ఆ అధికారికి అంతర్గతంగా సహకారం ఉందని తెలుసుకున్న సిబ్బంది ఇతర శాఖల బాధ్యులు, చేసేదేమీ లేక వీరి ప్రాంతానికి బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం ఆ శాఖ పరిస్థితి ప్రతి ఒక్కరూ బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో శాఖలోని విభాగాలు కిందిస్థాయి ఉద్యోగులు లేక శాఖ కార్యాలయం తో పాటు కార్యకలాపాలు త్వరలో ఆగిపోయే పరిస్థితి నెలకొల్పే విధంగా కనబడుతుంది.
ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?
మండలంలోని ఆ శాఖ అధికారి ప్రస్తుతం మూడు ప్రధాన విభాగాలను టార్గెట్ చేసి ఎక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో ఆ విభాగాలకు సంబంధించిన బాధ్యులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో నెలసరి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖలోని మిగతా విభాగాలు తక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో వారిని కూడా వారి స్తోమతకు మించి అవినీతికి పాల్పడాలని హింసిస్తూ తనకు నెలసరి వాటా కచ్చితంగా ఇవ్వాలని నికిత చిన్న తరహాలో నిర్వహించబడుతున్న విభాగాల బాధ్యులకు హుకుం జారీ చేసి వారి వద్ద నుండి నెలసరి జీతంల అక్రమ సొమ్మును పీడించి వసూలు చేయడం జరుగుతుందని లేదంటే విజిలెన్స్ దాడులకు సిద్ధంగా ఉండాలని అధికారి హుకుం జారీ చేయడం జరుగుతుందని సమాచారం. అధికారి ఒత్తిడికి తట్టుకోలేక సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు అవినీతికి పాడు పరిస్థితి లేకపోవడంతో తమ జీతాల నుండి అధికారికి రూపాయలు ఇచ్చి ఎలాగో అలా తమ ఉద్యోగాన్ని దక్కించుకొని విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం.
ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?
జిల్లాలోని సొంత శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు విభాగాల బాధ్యులకు అవినీతి కొరకు ప్రోత్సహించి నెలసరి జీతం లాగా అక్రమాలు చేసి సొమ్ము అందించాలని లేదంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఉద్యోగం లేకుండా చేస్తానని సొంత శాఖ సిబ్బంది విభాగాల బాధ్యులకు పీడిస్తున్న ఆ అధికారి బండారం బయటపడినప్పటికీ, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు ఆ శాఖలోని సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు పీడించే ఆ అధికారికి జిల్లాలోని కొందరు ఉన్నత అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని అందుకొరకు ఆ అధికారి తనకంటే పై అధికారులకు కూడా గౌరవం భయం లేనివిధంగా ప్రభాస్ తీస్తున్నాడని చెప్పుకుంటూ ఆశ్చర్యా పోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ అధికారి ఎక్కడ విధులు నిర్వహించిన, కింది స్థాయి ఉద్యోగులకు పీడించడమే లక్ష్యంగా అవినీతికి పాల్పడి తనకు సొమ్ము అందించడమే సిబ్బంది విభాగాల బాధ్యులు చేసే ప్రధాన పని అని పీడించడం ఆ అధికారికి కొత్తవి కాదని, కానీ జిల్లా మరియు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటివరకు ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణం ఏమిటో ఆ శాఖ పలు అధికారులకు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఏది ఏమైనా సొంత శాఖలో ఇలా అవినీతి చేసి ప్రతినెలా మామూలు ఇవ్వాలని పీడిస్తున్న మండలంలోని ఓ శాఖ అధికారి ఇలాంటి అధికారి మరియు శాఖ రాష్ట్రంలోని ఎక్కడ ఉండదు, కానీ ఈ అధికారి మాత్రం నిర్భయంగా సొంత శాఖలో సిబ్బందికి విభాగాల బాధ్యులకు పీడించి అక్రమ సొమ్ము నెలసరి జీవితంలో దోచుకోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆ శాఖలో ఈ అధికారిపై రోజుకు ఒక కొత్త రకమైన అవినీతి తెరపైకి రావడం అధికారులు ఇలాంటి చర్యలపై మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిందే.