
పెద్ద తండా ఆర్ & బి రోడ్డు నుండి మన్య తండ (లక్ష్మీ నరసింహపురం) వరకు 8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
పెద్దతండ క్రాస్ రోడ్ నుండి చెక్ డ్యామ్ వరకు 1కోటి 35 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
డోర్నకల్ నియోజకవర్గం నందు 108 బి.టి రోడ్డు నిర్మాణ పనులకు 155 కోట్ల 39 లక్షల నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పెద్దతండలో 6 కోట్ల అంచనా వ్యయంతో రహదారి వెడల్పు, మరియు సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
పెద్దతండలో 35 లక్షల అంచనా వ్యయంతో కమ్యూనిటీ హాల్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
పెద్ద తండాలో 34 లక్షల అంచనా వ్యయంతో 2 అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
బంచరాయితండ ఆర్ &బీ రోడ్డు నుండి పీతలగడ్డ (బాలాజీ పేట) వరకు 9 కోట్ల అంచనా వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి మరియు చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు..
అనంతరం పెద్దతండలో బతుకమ్మ చీరలను పంపిణీ, యువతకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు.
సభ వేదికగా భవోద్వేగానికి లోనైన కంటతడి పెట్టుకున్న మంత్రి సత్యవతి రాథోడ్.
తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారుమంత్రి సత్యవతి రాథోడ్. తన తల్లిదండ్రులు ఉండి ఉంటే పెద్ద తండా అభివృద్ధిని చూసి ఎంతో సంతోషపడేవారంటూ కంటతడి పెట్టుకున్నారు.
గిరిజన సంక్షేమానికి 6 కోట్లతో అభివృద్ధి.
మరిపెడ /కురవి నేటి ధాత్రి.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి 6 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
శనివారం డోర్నకల్ నియోజకవర్గo లో ని కురవి మండలం పెద్ద తండా గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోతు కవిత,జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు,ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు,జిల్లా కలెక్టర్ శశాంక లతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమం, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ నుండి సుమారు 400 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పెద్ద తండాలో ఏర్పాటు చేసిన సభలో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొని చీరలను పంపిణీ చేశారు అలాగే యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు,ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తన శాఖ నుండి అభివృద్ధి కార్యక్రమాలకు 6000 కోట్లను ఖర్చు చేశానని అందులో 450 కోట్లు మహబూబాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు. అందులో కూడా 150 కోట్లు కేవలం నా ప్రాంతానికే కేటాయించినట్లు మంత్రి తెలిపారు,డోర్నకల్ నియోజకవర్గంలో 108 రహదారులకు 155.39 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 135 లక్షలతో పెద్ద తండా నుండి చెక్ డాం వరకు గల పనులకు ,మన్య తండా హై లెవెల్ బ్రిడ్జి పనులకు 8 కోట్లు, పెద్ద తండా నుండి మొగిలిచర్ల వరకు కిలోమీటర్ పరిధిలో ఆరు కోట్లతో సైడ్ డ్రైన్స్ , మరియు సెంట్రల్ లైటింగ్ లకు, 35 లక్షలతో కమ్యూనిటీ హాలు, 36 లక్షలతో మూడు అంగన్వాడి కేంద్రాలు, మరో 10 లక్షలతో కాంపౌండ్ వాల్సు మరుగుదొడ్ల పనులకు శంకుస్థాపన చేశారు,పొలాల మధ్య ఉన్న వాగులపై నిర్మించనున్న అత్యంత ప్రాధాన్యత ఉన్న రోడ్డు, బ్రిడ్జిలకు గాను 17 కోట్లు కేటాయించినట్లు తెలియజేశారు.
ఇంతకుముందు తాను జడ్పిటిసిగా ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో యతి రాజారావు మంత్రి సహకారం తో 35 లక్షలతో ఎత్తిపోతల పథకం మంజూరు చేయించినట్లు తెలియజేశారు అదేవిధంగా మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి సహకారంతో చెక్ డ్యాం ఏర్పాటు చేస్తున్నామన్నారు,గార్ల మండలం రాంపురం వాగు పై 15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామని నిధులు సరిపోకపోతే అదనంగా కేటాయిస్తామన్నారు,నేతన్నల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 500 కోట్లతో ప్రతి సంవత్సరం మహిళా లకు బతుకమ్మ చీరలు పుట్టింటి సారె గా అందిస్తున్నట్లు తెలియజేశారు, గతంలో అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార లోపాన్ని భర్తీచేసేందుకు పిండి మాత్రమే పంపిణీ జరిగేదని ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో భోజనం తో పాటు పాలు గుడ్లు అందించ గలుగుతున్నామని మంత్రి వివరించారు,అనంతరం మంత్రి కన్నీళ్ళ పర్యంతరమై భావోద్వేకానికి లోనయ్యారు. తన తండ్రి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వ్యవసాయం చేసేవారని ఆ బాధలు ప్రత్యక్షంగా చూసానని అందుకే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టానన్నారు. తన తల్లి తండ్రి కాలం చేశారని జీవించి ఉంటే ఎంతో సంతోషించే వారని, బ్రిడ్జి నిర్మాణాలతో వారి కోరిక తీరనున్నదన్నారు,ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బండి వెంకటరెడ్డి,సర్పంచ్ గుగులోతు వనజ శ్రీరామ్ నాయక్, మోహన్ నాయక్,జోగు రామ్ నాయక్, ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్,ట్రైబల్ వెల్ఫేర్ హేమలత,ఎంపీడీవో సరస్వతి, తాసిల్దార్ సునీల్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు గుగులోత్ కిషన్ నాయక్, కొమ్మినేని రవీందర్,
కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,శ్రీ రంగరెడ్డి,మరియు
అర్చకుడు వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.