బాధితులకు న్యాయం జరగాలని “మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” తపనపడ్డారు అందుకోసం “జీవో” జారీ చేశారు.??
వరంగల్‌లో ఇంతవరకు “డిఆర” లేడు ఇన్చార్జి “డిఆర” తో ఎందుకు కాలం వెళ్లదీస్తున్నారు?

`చిట్ కంపెనీల పేర్లు చూసి మోసపోకు.. బోర్డులు చూసి బోల్తాపడకు!
`ఎజెంట్లు చెప్పే మాయ మాటలు వినకు?

`ఒక్కసారి మూట వస్తుందని మురిసిపోకు?
`ఏజెంట్ల మాటలు నమ్మి ఎగిరి గంతేయకు?
`కష్టపడిన సొమ్ము చిట్ కంపెనీ కాకుల పాలు చేయకు?
`గద్దల్లా పొడుచుకు తింటారు!
`రాబందులై పీక్కు తిని పినుగను చేసే దాక వదలరు?
`అధికారులున్నారు అన్యాయం కానని అనుకోకు!
`చట్టాలు రక్షిస్తాయని నమ్మకం పెట్టుకోకు!
`వరంగల్ లో వరుస మోసాలు…కంపెనీలు మూసి డైరెక్టర్ల విలాసాలు.
`ముంచుడెక్కువ.. పంచుడు తక్కువ!
`చిట్ కంపెనీల చీటింగ్ రహస్యం.
`బోర్డు పెట్టాలే… చిట్టీలు కట్టించుకోవాలె!
`మునిగిపోయామని బోర్డు తిప్పేయాలే!
`బినామీలకెక్కువ..చిట్టి దారులకు తక్కువ!
`అధికారులు దగ్గరుండి కంపెనీలకే మేలు చేస్తున్నారు!
`జనం గోడు వినిపించుకునే తీరిక ఎవరికీ లేదు?
`ముంచేస్తున్నా ముందట పడి ఎవరూ సాయం చేయడానికి రారు!
`ప్రభుత్వ ఆదేశాలనే అధికారులు పట్టించుకోవడం లేదు!
`“జీవో”ను అమలు చేసే దిక్కులేదు?
రాజకీయ నాయకులకు ఈ మోసాలు అర్ధం కావు?
`అధికారులు దగ్గరుండి తూట్లు పొడుస్తున్నారు?
`అసలైన బాధితులు నిండా మునిగిపోతున్నారు.
`కంపెనీ బినామీలకు సొమ్ములు పంచి చేతులు దులుపుకుంటున్నారు!
`జవాబుదారి తనం గంగలో కలుపుతున్నారు.
`చిట్ కంపెనీలకు ఎందుకు మేలు చేస్తున్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
ఏ చిట్‌ఫండ్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..సమస్త కంపనీలు జనం సొమ్మును మింగేయడం తప్ప అన్నట్లే వుంది. గాలికి పోయే కంపను జేబులో పెట్టుకోవడం అంటే చిట్ కంపనీలను ఆశ్రయించడం, కష్టపడి సంపాదించిన సొమ్ము జనం వారి చేతుల్లో పెట్టడం ఒక్కటే. కూర్చున్న చోట నుంచి కదలకుండా, జనం సొమ్ముతో చేసే ఏకైక వ్యాపారం చిట్స్. కడుపు చల్లగా కదలకుండా కూర్చున్న చోటనే జనం సొమ్మును పోగేసుకోవడం తెలిసిన వారు భవితకు బంగారం అంటారు. కలలకు సాకారం అంటారు. జనం సొమ్ము భద్రమని ఆకర్షణీయమైన ప్రకటనలు తయారుచేస్తారు. ప్రచారం చేస్తారు. ఫలానా చిట్ పండ్ కంపనీలో చిట్ వేయడం వల్లేనే ఇల్లు కొన్నానని చెబుతారు. కారుకొన్నానని వీడియో ప్రకటనలు రూపొందిస్తారు. ఆ కంపనీలలో చిట్ వేయడం వల్లనే తమ పిల్లలు ఉన్నత చదువులు చదువున్నారని చెప్పిస్తారు. ఫలాన కంపనీ వల్లనే తమ పిల్లలు విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పిస్తారు. ఇలా లేని ఇల్లూ వాకిలి అంతా ఆ కంపనీ దయే అన్నట్లు ప్రకటనలు తయారు చేసి జనం మీదకు వదిలేస్తారు. ఇదంతా జనం సొమ్ముతోనే సాగిస్తారు. జనాన్ని ఆకర్షిస్తారు. అద్దాýతో కూడిన ఆకర్షణీయమైన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. హంగూ ఆర్భాటాలు సాగిస్తారు. సెలబ్రెటీలను పిలిపిస్తారు. వారి చేత కార్యాలయాలు ప్రారంభిస్తారు. వారి చేత నాలుగు మంచి మాటలు చెప్పిస్తారు. ఆ సెలబ్రిటర్లదే బాద్యత అనేలా ప్రకటనలు ప్రచారం నమ్మిస్తారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఊరు మీదకు తోలేస్తారు. చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తారు. నెల నెల చిట్టీలు కట్టేలా చేస్తారు. సంపాదించిన సొమ్ము ఇంట్లో వుంటే ఏమొస్తుంది? మా కంపనీలో చిట్ వస్తే భవిష్యత్తుకు అక్కరకొస్తాయని చెబుతారు. ఇంట్లో డబ్బులు వుంటే ఖర్చవుతాయని చెబుతారు. అమాయకులు ఆ చిట్ కంపనీని నిమ్మి చిట్ కట్టేస్తారు. నెల నెల చిట్ కట్టినా, అవసరానికి ఆ చిట్ రాదు. ఆ డబ్బులు ఇక జీవితంలో రావు. ఇదీ ఇప్ప్పుడు చిట్ కంపనీలు సాగిస్తున్న అక్రమ దందాలు. అందుకే సామాన్యులు చిట్ కంపనీలు నమ్మి చిక్కుల్లో పడొద్దు. కష్టపడి సంపాదించిన సొమ్ముకు చిట్ ఫండ్ కంపనీల చేతుల్లో పెట్టొద్దు. ఇంట్లో డబ్బులు వుంటే ఏమొస్తుంది. చిట్ వేస్తే ఒక్కసారిగా మూట వస్తుందని అనుకోవద్దు. ఏజెంట్ల మాటలు అసలే నమ్మొద్దు. తెలంగాణకే తలమానికమైన వరంగల్ జిల్లాలో ఇలా పుట్టగొడుగుల్లా పెట్టి, మూసేసిన చిట్ కంపనీలు అనేకం వున్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే వేలాది మందిని మోసం చేశారు. పదుల సంఖ్యలో చిట్ కంపనీలు బోర్డులు తిప్పేశాయి. ఇంకా సక్కదనానికి ఈ కంపనీలు బ్రాంచిల పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అన్ని మూసేసి చేతులెత్తేశారు. ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఉడాయించి శఠగోపం పెట్టారు. కష్టపడిన సొమ్మును ఎగిరిపోయే కాకుల్లాంటి చిట్ కంపనీల్లో పెట్టుబడులు పెట్టి, ఇప్ప్పుడు పదేళ్లుగా తిరుగుతున్నవారు వేలాది మంది వున్నారు. జనం చనిపోతున్నా ఒక్క పైసా ఇవ్వరు. జనం సొమ్ముతో రాబందులుగా మారి పీనుగులను కూడా పీక్కు తినేలా తయారయ్యారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద చిట్ వేస్తే భరోసా వుండదని, చిట్ కంపనీలలో వేస్తే అదికారులు చూసుకుంటారని అనుకోవద్దు. చట్టాలు తమను రక్షిస్తాయని ఆశించొద్దు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఇలా వరంగల్ కేంద్రంగా ఏర్పాటైనే అనేక సంస్ధలు మూత బడ్డాయి. కాదు ఆ కంపనీ వ్యక్తులే మూసేసుకున్నారు. దివాళా తీశామని అబద్దాలు చెప్పి, కార్యాలయాలు ఖాళీ చేసుకుంటారు. జనం సొమ్ముతో ఉడాయించి కంపనీ వ్యక్తులు విలాసాలు సాగిస్తున్నారు. జనం సొమ్ముతో కోట్లాది రూపాయలు భూములు కొనుగోలు చేసుకున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. ఆస్ధులన్నీ ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టుకున్నారు. చిట్టిలు కట్టిన జనం నరకం చూస్తుంటే జనం సొమ్ముతో కంపనీ వ్యక్తులు స్వర్గాలు చూస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం జోక్యం చేసుకొని జనం సొమ్ము తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా, కోర్టులు చెప్పినా వినేవారు లేరు. జనం సొమ్మును ఇస్తున్న దాఖాలలు లేరు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత చిట్ బాదితుల సమస్యలు విని ఒక జీవో జారీ చేసింది. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో బాధితుల సమస్యలు అనేకం విన్నారు. ఆయన మంత్రి అయ్యాక బాదితులకు న్యాయం జరగాలని తలంచారు. ప్రభుత్వం చేత జీవో జారీ ‘ చేయించారు. బాదితులకు సొమ్ము అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాని ఏం జరుగుతోంది. అదికారులు సహకరించడం లేదు. నిజమైన బాధితులకు ఇక్కడ కూడా అన్యాయమే చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలను అమలు చేస్తున్నట్లు నటిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్లతో కలిసి నాటకాలు ఆడుతున్నారు. అసలైన బాదితుల స్దానంలో కంపనీకి చెందిన వ్యక్తుల పేర్లు తెరమీదకు తెచ్చి వారి చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. చెక్కులు అందించినట్లు చెప్ప్పుకుంటున్నారు. ఇ ంత దుర్మార్గం ఎక్కడైనా వుంటుందా? అని నిలదీసే వారులేకుండాపోయారు. జనం సొమ్ముకు అండగా వుండి, వారి సొమ్ము వారికి అందేలా చూడాల్సిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా చిట్ కంపనీ చెప్పి వారికే బకాయిల చెక్కులు జారీ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇంత జరుగుతున్నా పట్టించుకున్న ప్రజాప్రతినిదులు లేరు. ఒక రకంగా చెప్పాలంటే వారికి ఇలాంటి సమస్యల మీద అవగాహన లేదు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కనీసం ఓ పది లక్షల మంది చిట్ కంపనీల బాదితులు వుంటారని సమాచారం. కొన్ని వేల కోట్లరూపాయలు చిట్ కంపనీలు ఎగనామం పెట్టాయన్న సంగతి కూడా నాయకులు తెలియదు. ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలైన సన్న బియ్యం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించేందుకు పోటీలు పడి ముందుకొస్తారు. పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకుంటుంటారు. ఇప్పటికైనా అదికార పార్టీ నాయకులు మేలుకొండి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, సిఎం. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డిలు దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ముందు దాని గురించి తెలుసుకోండి. చిట్ ఫండ్ కంపనీలు మోసం చేసిన వారి గోడు వినండి. వారి సొమ్ములు ఇప్పించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేయండి. అదికారుల అవినీతికి పాల్పడకుండా చూసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా వున్న పది లక్షల మంది బాదిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. పదే పదే కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎంత దగ్గరుండి అందించినా జనంలో సానుభూతి రాదు. కాని బాదితుల సొమ్మును తిరిగి ఇప్పిస్తే వారిలో జీవితాంతం కతజ్ఞత వుంటుంది. జీవితాంతం కాంగ్రెస్నాయకులను దేవుళ్లుగా కొలుస్తారు. ఓట్లేసి గెలిపిస్తారు. పైగా బాదితుల గోడు స్వయంగా విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం గొప్పది. దానిని అమలు చేసే బాధ్యత అదికారులు తీసుకోవాలి. కాని అదికారులు కంపనీ వ్యక్తులకు సాయపడుతున్నారు. బాదితులను మళ్లీ మళ్లీ అన్యాయం చేస్తున్నారు. ఇప్ప్పుడు కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే తెలంగాణ అంతా కాంగ్రెస్ నాయకులకు జేజేలు కొడుతుంది. ఎన్నికల్లో తిరుగులేని శక్తిగాకాంగ్రెస్ను నిలబెడుతుంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. బాదితుల కలలు నెరవేరుతాయి. వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. కాంగ్రెస్ మీద మరింత నమ్మకం పెరుగుతుంది. కంపనీని నమ్మి, అదికారుల నమ్మి మోసపోయిన బాధితులకు కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్న అధికారులను గాడిలో పెట్టాలి. జనానికి న్యాయం చేయాలి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలోనే అతి పెద్ద నగరమైన వరంగల్‌లో జిల్లాలో పూర్తి స్దాయి డిస్ట్రిక్టు చిట్ రిజిస్ట్రార్ లేదు. ఇన్చార్జీ డిఆర్తోనే కాలం గడుపుతున్నారు. ఇందులోనూ ఏదో మతలబు వుందన్న వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. ఇలాంటి లోగుట్టులు బైట పడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్న కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే అన్నీ తేలుతాయి. రహస్యాలు వీడుతాయి.
