వేముల సాయి చరణ్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖమ్మ ఆత్మీయ సన్మానం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేముల సాయి చరణ్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ గురువారం హన్మకొండలోని రామ్ నగర్ లో గల మంత్రి స్వగృహంలో పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఆత్మీయంగా సన్మానం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు..కొండా దంపతుల వీరాభిమాని వేముల మహేందర్ గౌడ్ తన తనయుడితో కలిసి గురువారం మంత్రి నివాసంలో కొండా సురేఖమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖమ్మ మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన తనయుడు వేముల సాయి చరణ్ ను పలకరించారు. ఏం చదువుకుంటున్నావు..పరీక్షలు బాగా రాశావా అంటూ పలకరించడంతో..వేముల సాయి చరణ్ మంత్రి కొండా సురేఖమ్మకు బదులిస్తూ..ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తయింది మేడం..ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో ప్రతిభ కనబరిచానని తెలపడంతో..ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రాణించి.. భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖమ్మ వేముల సాయి చరణ్ కు సూచించి ఆశీర్వదించారు. క్రమశిక్షణతో, పట్టుదలతో, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి..అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలని, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు, తోటి స్నేహితులకు, తోబుట్టువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి..సమాజంలో గుర్తింపు పొందాలని మంత్రి కొండా సురేఖమ్మ వేముల సాయి చరణ్
