తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా.
తెలంగాణలో బిఆర్ఎస్ హైట్రిక్ పక్క. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం:నేటి ధాత్రి మంత్రి హరీష్ రావు పడతనపల్లి గ్రామం హాజీపూర్ మండలంలో ఎత్తిపోతల పథకంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సభలో హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వంతో మాట్లాడి హాజీపూర్ మండలంలో మెడికల్ కాలేజిని ఏర్పాటు చేశారు మరియు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తను కచ్చితంగా అందుబాటులో ఉంటాడని, ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ అందరి అవసరాలను తీరుస్తారని, అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా సాయంత్రం మంచిర్యాల వచ్చి తెల్లవారుజామున సమావేశాలకు హాజరవుతాడని ప్రజలు అంటే దివాకర్ దివాకర్ రావుకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా హాజీపూర్ మండలంలో దాదాపుగా 8,000 ఎకరాలకు సాగునీరు వస్తుందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే భస్మాసుర హస్తమని అలాంటి పార్టీలను నమ్మవద్దని తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, వివిధ రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఒకవేళ వేరే పార్టీలను నమ్మి ఓటు వేసినట్లయితే ఈ పథకాలన్నీ రద్దు చేస్తారని ప్రజలను హెచ్చరించారు. స్థానిక ప్రజలందరూ వేరే పార్టీలకు చెందిన వ్యక్తులను నమ్మి మోసపోవద్దని స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావును మళ్లీ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి అధ్యక్షుడు నడ్డాని ఉద్దేశించి అనేక కమిటీలను వేస్తున్నారు కానీ బిజెపికి ఎమ్మెల్యేల డిపాజిట్ దక్కించుకోవడం ఎలా అనే కమిటీ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ పడతనపల్లి ఎత్తిపోతల పథకం వలన అనేక గ్రామాల్లో సాగునీరు వస్తుందని, గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మరియు గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించడం జరిగిందని దానివల్ల మంచిర్యాల నియోజకవర్గంలో రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు అదేవిధంగా మంత్రి హరీష్ రావు సహకారంతో మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద సమస్య ఉందని దానిని పరిష్కరించాలని కోరడం జరిగింది. తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఎంపీ వెంకటేష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ విటల్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.