Headlines

భారతదేశం అబ్బురపడెల ఆసుపత్రుల నిర్మాణం.

 

10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం

కాంగ్రెస్ బీజేపీ లను నమ్మితే మోసపోయి గొసపడుతం.

సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో నడ్డి విరిగిన నాడ్డా.

పరిపూర్ణుడు మీ బాల్కసుమనుడు

చెన్నూర్ గడ్డ బాల్క సుమన్ అడ్డ

మంత్రి హరీష్ రావు వాఖ్యలు.

మంచిర్యాల జిల్లా: చెన్నూర్, నేటిధాత్రి:

మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న వైద్య ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెన్నూర్ నియోజకవర్గం కేంద్రం లో పర్యటించారు.ఆధునిక వసతులతో అత్యుత్తమమైన నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందించేందుకు నిర్మించిన 50 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజుప్రారంభించారు.అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. చెన్నూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాల కాలం లో ఎవరు పట్టించుకోని చెన్నూర్ నియోజకవర్గాన్ని బాల్క.సుమన్ 5 ఎండ్ల లో అభివృద్ధి చేసి చూపించారని చెప్పారు.10 కోట్లతో 50 పడకల నూతన ఆసుపత్రిని నిర్మించారు అన్నారు.500 కోట్లతో మందమర్రి పట్టణం లో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు అన్నారు.1600 ల కోట్లతో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నీ ప్రారంభించి రైతుల కష్టాలు దూరం చేయబోతున్నాం అన్నారు.బాల్క.సుమన్ ఒక పరిపూర్ణమైన ఎదిగిన నాయకుడు అని రెవెన్యూ డివిజన్ నీ సాధించి మి చేతుల్లో పెట్టారు అన్నారు.55 కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేసిన ఘనత బల్కసుమన్ ది అని కొనియాడారు.ఈ సందర్భంగా వరల్డ్ కప్ జరిగే నేపథ్యం లో ప్రతిపక్షాలను పోల్చుతూ విమర్శించారు.క్రికెట్ లో బీజేపీ డక్ ఔట్,కాంగ్రెస్ రన్ ఔట్ కెసిఆర్ సెంచరీ చేయడం పక్కా అని చలోక్తులు విసిరారు. మోసపోతే గోస పడుతం సాధ్యం కాని పథకాల పేరుతో కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే వైకుంఠపాళి లో పై స్థాయిలో ఉన్న తెలంగాణ మళ్ళీ కిందకు రావడం గ్యారంటీ అని కనీసం డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పారు.సొంత రాష్ట్రం లో నడ్డి విరిగిన నడ్డా కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.అర్ ఎస్ ఎస్ నుంచి టి డి పి కాంగ్రెస్ కు మారిన ఉసరవెల్లి మళ్ళీ ఎన్ని పార్టీ లు మారతాడో అలాంటి వారికి ఓటువెస్తే గోసపడుతం అని రేవంత్ రెడ్డి కి పరోక్షంగా చురకలు అంటించారు.పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఉన్నది కాంగ్రెస్ కధ మరి అక్కడ పించన్ ఎంత ఇస్తున్నారు,రైతు బంధు దలితబందు కల్యాణలక్ష్మి అక్కడ ఉన్నాయా అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుంది ,అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎలా చేస్తారు అని ప్రశ్నించారు.దమ్మున్న నాయకుడు ఎదిగిన నాయకుడు బాల్క.సుమన్ నీ బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *