
హన్మకొండ,నేటిధాత్రి:
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా హాస్పిటల్స్ వారు మినీ వాక్ థాన్ ను హాస్పిటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకి నిర్వహించారు
గుండె సంరక్షణపై ఆరోగ్యమైన జీవనశైలి పై అవగాహన కల్పిస్తూ సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉంటే గుండెపోటుకి గురైన వారిని కాపాడే అవకాశాలు ఉంటాయన్నారు
సిపిఆర్ ఫై అవగాహన పెంచుకోవడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడుకోగలమని సూచించారు హాస్పిటల్ నుండి ప్రారంభమైన ఈ వాక్ థాన్ నీ డీసీపీ మురళి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రజల ప్రాణాలు కాపాడడంలో ముందంజ ఏకశిలా హాస్పిటల్ వారు సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని వారం రోజులపాటు నగర ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ జి రమేష్ హాస్పిటల్ కార్డియాలజిస్టులు డాక్టర్ సంతోష్ మేధాని, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ అనిల్, డాక్టర్ లావణ్య, సిటిఆర్ఎస్ సర్జన్ డాక్టర్ శివ నాగర్జున, క్రిటికల్ స్పెషలిస్ట్ డాక్టర్ అసిఫ్ ఇక్టల్, డాక్టర్ వెంకట్ రెడ్డి,హాస్పిటల్స్ సిబ్బందితోపాటు ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యం వాగ్దేవి, చైతన్య వారి విద్యార్థులతో పాటు వాకర్స్ పబ్లిక్ గార్డెన్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారుగా 1000 మంది పాల్గొన్నారు.