పత్రికలు వారధిలా ఉండాలి..డీఎస్పీ అడ్లూరి రాములు
మెట్ పల్లి జనవరి 23 నేటి ధాత్రి
పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ప్రజల సమస్యలను వెలికితీసి పరిషష్కారం జరిగేలా వార్తలు ఉండాలని మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా కలం దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ప్రజా కలం దిన పత్రిక 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ. ప్రజా కలం దిన పత్రిక ప్రజా సమస్యల వెలికి తీసి సమస్యల పరిష్కారం లో ముందుంటుందని అన్నారు. పత్రికలు ప్రజలకు అవగాహన కల్పించే వార్తలను ప్రచురించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రూరల్ రిపోర్టర్ కుర్ర రాజేందర్, టీయూడబ్ల్యూజే ఐజేయు. జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ షేక్ సాజిత్, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్,ఈసీ మెంబర్ పోనాగానీ మహేందర్, ఆర్గనైజర్ సెక్రెటరీ మొహమ్మద్ సమీ మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, శశి కుమార్, టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
