
పాలకుర్తి నేటిధాత్రి
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి మేరు సంఘం పాలకుర్తి ఆధ్వర్యంలో
శనివారం మండల మేరు భవనంలో మండల అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంఘ సభ్యుల సమావేశంలో జనగామ జిల్లా మేరు సంఘం ఉగాది నూతన సంవత్సర (క్రోధి నామ సంవత్సర ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025) క్యాలెండర్, మేరు కుల దైవం శ్రీ శ్రీ శ్రీ జఠగిరి శంకర దాసమయ్య చిత్రపటాలను
జిల్లా మేరు సంఘం అధ్యక్షులు రాపర్తి ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరించి సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాపర్తి ప్రశాంత్ మాట్లాడుతూ మేరు కులస్తులు ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు సోమ సత్యం, జనగామ మేరు సంఘం టౌన్ అద్యక్షులు రామగిరి శ్రావణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తకొండ వాసు, కీర్తి యాదగిరి, మండల కార్యదర్శి గూడూరు లెనిన్, మాశెట్టి లక్ష్మీ నారాయణ, గూడూరు రవి, కీర్తి కుమార్ , కీర్తి శేఖర్ , కీర్తి రవి, కీర్తి వెంకటయ్య, గట్ల నాగరాజు, పొడిశెట్టి ప్రభాకర్, సంగ వెంకటేశ్వర్లు, గూడూరు నిరంజన్, గూడూరు రమేష్, కీర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.