హన్మకొండ:నేటిధాత్రి
-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్.
వరంగల్ సైబర్ క్రైమ్ ఏసిపి గా విధులు నిర్వహిస్తున్న కూజ విజయ్ కుమార్ ముదిరాజ్ ను ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం “ఉత్కృష్ట సేవా పథకం” అవార్డ్ ను అందించింది.ఈ సందర్భంగా మెపా (ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో విజయ్ కుమార్ ముదిరాజ్ ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన ఆఫీస్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన సన్మానించడం జరిగింది. అనంతరం సన్మాన గ్రహీత విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడం నా బాధ్యతను ఇంకా పెంచింది అని,సమాజ సేవలో యువత రావాలనీ,ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా కాకుండా యువత అవగాహన కలిగి ఉండాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర నాయకులు నీరటి రాజు,డా.ఈర్ల రాకేష్,కూతురు రాజు,ఆకుల శివ ముదిరాజ్, రాజు,బొల్లి.కిషోర్ ముదిరాజ్ లతో పాటు ముదిరాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.