Mentally Unstable Man Missing, Case Filed
మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
జడ్చర్ల /నేటి ధాత్రి.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండకళ్ల కుమార్ (34) గత రెండు నెలల క్రితం పెరాలసిస్ వ్యాధి సోకింది. అప్పటినుండి మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు.. గురువారం బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.
