తిరుపతిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు..
తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 21:
జనసేన పార్టీ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారుమెగా అభిమానులు, జనశ్రేణులతో కలసి ఎమ్మెల్యే
బర్డ్ డే కేకును కట్ చేసి,అన్న వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెగాస్టార్ పద్మ విభూషణ్ కొణిదల చిరంజీవి పై మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. మెగా కుటుంబం పై అభిమానులు చూపించే ప్రేమ, అనురాగాలే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు శ్రీ రామ రక్షా అని వారు స్పష్టం చేశారు. ఈరోజు చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోబాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, రాజమోహన్, ఆనంద్, జీవకోన సుధా, లక్ష్మీపతి, హేమంత్, పురుషోత్తం, సాయి,ఆది, రమేష్ నాయుడు, సుమంత్, సుధాకర్, మదు,జీవన్, శ్రావణ్, అమృత, చందు, మార్కెట్ యువరాజ్, మాధవ రావు, వెంకటేష్, శేషాద్రి, జానకిరామ్, ప్రభాకర్ రెడ్డి, కిషోర్, ఉదయ్,
కృష్ణ,పవన్, ముఖేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.