తంగళ్ళపల్లినే టి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే రెండో సీఎం అని చెప్పుకునే మన మాజీ మంత్రి కేటీ రామారావు మన మండలంలోని సర్పంచులకు ఎంపిటిసి లకు బిల్లులు చెల్లించకపోవడం వారి నిదర్శనానికి వదిలేస్తున్నామని అలాంటిది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేయడం తగదని ఆయన అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పెండింగ్ బిల్లులు వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా మహిళ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు