బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి లో ఈ నెల 18 వ తేదీ నుండి 19 వ తేదివరకు వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఈర్ల సంపత్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడని కోచ్ సల్పాల సంతోష్ యాదవ్ తెలిపారు. షాట్ పుట్ లో సంపత్ కంచు పతకం సాధించాడని అయన తెలిపారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి ఈ. మారయ్య మాట్లాడుతూ యువతకు క్రీడలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ రానున్న కాలం లో క్రీడల పట్ల మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కోచ్ సంతోష్ యాదవ్ ను, అథ్లెట్ సంపత్ ను అభినందించారు.