-కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ …
కొల్చారం,(మెదక్) నేటిధాత్రి :-
మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి జరగబోయే ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ దీమా వ్యక్తం చేశారు. బి ఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రజలు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బారి మెజారిటీతో గెలిపిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో కల్యాణ లక్ష్మి , షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా , పలు పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ముత్యం ప్రవీణ్ కుమార్ అన్నారు.