మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్ వద్ధిరాజు గణేష్ ప్రతిపాదించగా కార్పొరేటర్ మరుపల్లి భాగ్యలక్ష్మి బలపరిచారు. పోటీకి ఎవరు లేకపోవడంతో మేయర్‌గా ప్రకాశ్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును ఏకగ్రీమైనట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ వరంగల్ మేయర్‌గా ఎన్నిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే లు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, అరూరి రమేష్, మేయర్ ఎన్నిక ఇంచార్జ్ బాలమల్లులకు కతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగర అభివద్ధికి కేటాయిస్తున్న నిధులతో నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని అన్నారు.