సిరిసిల్లలో మే డే జెండా ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డ వద్ద ఘనంగా మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో (బీఆర్‌ఎస్) కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధనలో మేడే దినోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు రావాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ… కార్మికుల హక్కులకు, కార్మిక శక్తికి ఎప్పుడూ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఏ ఒక్క కార్మికుడికి అనారోగ్య పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ తరఫున గాని ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య సంక్షేమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, తదితర ప్రజా నాయకులు మరియు స్థానిక కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ట్రేడ్ యూనియన్ సభ్యులు, మేడే సందర్భంగా పాల్గొన్నారు.
