మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బుధవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండల కేంద్రం ఎంపీడీవో ప్రాంగణంలో మాత రమాబాయి కి పూలమాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మనీ ట్రైన్ కమిటీ కందుకూరు డివిజన్ సభ్యులు జంతుక శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యాభ్యాసం గురించి రమాబాయి పాత్ర వర్ణనాతీతం అంబేద్కర్ విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న సందర్భంలో ఒకవైపు పిల్లల బాధ్యత అంబేద్కర్ విద్య అభ్యాసానికి ఆర్థికంగా సహకారం కై పేడలు కొట్టి అంబేద్కర్ ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా సహకారం అందిస్తూ అంబేద్కర్ శ్రమకు జీవం పోసిన ప్రదాత రమాబాయి తన సంతానం కలిగిన పిల్లలు మరణించిన కలత చెందకుండా, భారతదేశంలో ఉన్నటువంటి పేదలే తమ పిల్లలుగా అంబేద్కర్ గారి త్యాగానికి రూపమే మాతా రమాబాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొప్పు యాదయ్య ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపువ్వు మల్లేష్ , బుద్ధ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు మీసాల రమేష్ ,బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కంబాలపల్లి అల్లాజీ, టిఎంఆర్పిఎస్ కల్వకుర్తి ఇంచార్జ్ యాదయ్య,విజేందర్ తదితరులు పాల్గొన్నారు.