
200మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిక.
బీజేపీ జిల్లా మీడియా ఇంచార్జి రాజు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి,సుల్తాన్పూర్ గొరికొత్తపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర.
పార్టీ అభివృద్ధి దేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను భారీ మేజారిటీతో గెలిపించి సాగుతున్న అభివృద్ధిని కొనసాగించుకోవాలని తెలియజేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం గౌరవం ఉంటుందని, ఏ రోజు కూడా ఏ ఒక్కరిని చిన్నచూపు చూసే మనస్తత్వం నాది కాదని,పార్టీ ఏదైనా అవసరమని నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేయగలిగే వ్యక్తిత్వం ఉన్నదని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.
ఎవరు అడగకుండా గోరికొత్తపల్లి గ్రామాన్ని పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలంగా ఏర్పాటు చేసి ఇటీవలే దాదాపు కోటి యాభై లక్షల పైచిలుకు నిధులతో నూతన తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని తద్వారా గొరికొత్త పల్లి మండలం వ్యాపార రీత్యా. చాలా వరకు అభివృద్ధి చెందుతుందని స్థానికంగా నివసించే ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు,జీవన ప్రమాణాలు మెరుగుపడుతుందని, రానున్న రోజులలో గోరుకొత్తపల్లి మండలం ఒక ఆదర్శ మండలంగా ఏర్పడుతుందని తెలియజేశారు. పార్టీలో చేరిన సందర్భంలో వివిధ కులాల నుంచి కూడా పలువురు స్వచ్ఛందంగా చేరడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గండ్ర.
జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్న అన్ని కులాల సంఘాలకు భూములతో పాటు, ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం నిధులను కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. అవసరం ఉన్న గ్రామాలలో ముదిరాజ్ సోదరులకు కమిటీ హాల్ నిర్మాణాలకు వారి కులదేవత పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణాలకు తమ ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు మరొకసారి అవకాశం కల్పిస్తే. మరింత అభివృద్ధి చేసి. భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో ఒకటిగా ఉంచుతానని అన్నారు.
నేనెప్పుడూ కూడా అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పే వారిని సహించను మనసులో ఉన్నది చెప్తాను పని జరిగే విషయంపై. పనులు చేస్తానని.
నాకు దొంగ ఏడుపులు రావని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోరికొత్తపల్లి మండల అధ్యక్షులు మటిక సంతోష్ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.