మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం
భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటుచేసిన ఆలయ కమిటీలు
గొల్లపల్లి నేటి ధాత్రి:
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా సీతారాముల మహోత్సవం జరిగింది. గొల్లపల్లి మండల కేంద్రంలోని రామాలయం ఆలయంలో ఆలయ అర్చకులు తిరునహరి సత్యనారాయణ చార్యులు ఆధ్వర్యంలో కనుల పండుగగా శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. చిల్వాకోడూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర త్రి కూటాలయం లో శ్రీరామనవమి పురస్కరించుకొని పెద్ద ఎత్తున ప్రజలు సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం రామపురం వీధుల గుండా కళ్యాణమూర్తుల శోభయాత్ర కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించడానికి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు మాల ధారణ చేసిన హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, చిర్రా గంగాధర్, ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య, ఆలయ అర్చకులు తిరునహరి సత్యనారాయణ చార్యులు, గురిజాల బుచ్చిరెడ్డినేరెళ్ల మహేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.