DLPO Negligence Frustrates Sarpanches
జహీరాబాద్ లో కొత్త సర్పంచ్ లకు తలనొప్పిగా మరీనా డి ఎల్ పి ఓ కార్యాలయం!!
◆-: ఆఫిస్ తెరువరు అధికారి ఉండరు!!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎంతో కస్టపడి గెలిచినా ఫలితం లేన్నట్టు గా ఉంది కొత్తగా గెలిచిన సర్పంచ్ ల పరిస్థితి.జహీరాబాద్ నియోజకవర్గం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. బీదర్ కు అనుకోని ఉన్న సరిహద్దు గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలలో అనునిత్యం సేవా చేయాలనీ ఆరాటపడి గెలిచినా నిరాశకంగా ఉన్నారు సర్పంచ్ లు ఏదైనా డౌట్ వచ్చి సంబందించిన అధికారికి అడుగుదాం అనుకోని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుకి కలుద్దాం అని వెళ్ళితే వారు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు. ఆఫీస్ కి తాళం తీయరు.. అధికారి అందుబాటులో ఉండరు. తూ తూ మంత్రంగా బోర్డు లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డ్ లు వైకుంఠ దామలు నిరూపయోగంగా మారి మూలన పడ్డ సంబందించిన డివిజనల్ పంచాయతీ అధికారి కనీసం గ్రామాలలో తిరుగకపోవడం విడ్డురంగా ఉంది అని వాపోతున్నారు.జహీరాబాద్ నియోజకవర్గం కొందరు

ప్రజాప్రతినిధులు మరియు నియోజకవర్గం శాసనసభ్యులు, పలుమార్లు హెచ్చరించిన అవేవే పట్టనట్టు డి ఎల్ పి ఓ వ్యవహరిస్తున్న తీరు అందరికి అసహనానికి గురించేస్తుంది అని సర్పంచ్ వాపోతున్నారు.ఇ ప్పటికైనా కార్యాలయం ఏర్పాటు చేసి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో తిరిగి సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రజలు కోరుతున్నారు. లేనిచో జిల్లా కలక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ కు పిర్యాదు చేస్తామని ప్రజలు అంటున్నారు.
