మరమ్మత్తులు
వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి డివిజన్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులను పునరుద్దరించడానికి కృషి చేస్తున్నామని 22వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వరంగల్‌లోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులు కార్పొరేషన్ సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తూ వారి పనితీరును పరిశీలించారు. కొద్దిరోజులలో ప్రతి ఇంటికి మంచినీరు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. పైప్‌లైన్లు లేని ఏరియాలను గుర్తించారు. త్వరలో ఆయా ప్రాంతాలలో మంచినీటి పైపులు వేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మరుపల్ల రవి, సిబ్బంది లింగయ్య, ప్రకాష్, మరుపల్ల గీత, కళ్యాణపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.