
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మరియు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అసంపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంటి వద్ద పలువురు యువకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వయంగా కండువాలు కప్పి కార్యకర్తలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలందరూ కలిసి ఒక్కమాటపై నిలబడి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒకదాని వెనుక ఒకటి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తున్న తరుణంలో కొత్త కార్యకర్తలు అందరూ చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని నూతన ఉత్తేజంతో పనిచేస్తుందని, పార్టీలో చేరిన కార్యకర్తలు అందరిని అభినందించారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపెల్లి ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలోకి చేరిన ఇందారం టేకుమట్ల గ్రామాలకు సంబంధించిన ఉపసర్పంచ్లు మౌనిక కిరణ్, గుడిగందుల లక్ష్మీనారాయణ, సాగర్, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి వెంకన్న, అసంపల్లి మల్లయ్య, చిప్పకుర్తి పోశం, రాజ్ కుమార్ యాదవ్, శంకర్, అసంపల్లి శివ, చిప్పకుర్తి సతీష్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.