వేములవాడ రురల్ నేటి ధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రురల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు క్రియాశీలక నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు మీడియా ముకంగా తెలియపరుస్తూ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు నాయకులు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో చెక్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అడ్డిక జైపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ తలరి మంజుల సురేష్ మాజీ వర్డ్ సభ్యలు వసాల రాజేందర్ మెతుకు నారాయణ వంగ కావ్య శేఖర్ మరియు పలువురు కార్యకర్తలు ఉన్నారు