
– మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు,సిరిసిల్ల టౌన్ పోలీసులు
– అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల (నేటి ధాత్రి ):
సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన సిరిగిరి లక్ష్మి, వయస్సు 51 అనే మహిళ కుటుంబ కలహాల వలన శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దుకగా అటువైపు నుండి వస్తున్న డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు , సిరిసిల్ల టౌన్ పోలీసులు వెంటనే స్పందించగా దేవరాజు వెంటనే వాగులోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకవచ్చి, సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది.
వెంటనే స్పందించి వాగులో దూకి మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజుని సిరిసిల్ల టౌన్ పోలీస్ వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.