
General Meeting
మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు