
బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడు తున్నారు. మండల కేంద్రంలోని ప్రజలు విద్యార్థులు బస్సులో జిల్లాకు వెళ్లడానికి ఆటోలో వెళ్లి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు కోసం పడికాపులు కోస్తూ లేదంటే గ్రామాల నుండి స్టేజి వద్ద పడి కాపులు కాస్తున్నారు గ్రామాల నుండి ప్రజలు వచ్చి స్టేజీల వద్ద పడి కాపులే శరణ్యం.
ఆటోలే శరణ్యం.
గ్రామాలు బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం ఉండాలి ఒక గ్రామం మరొక గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రవాణా వ్యవస్థలే కానీ పాలకుల నిర్లక్ష్యo.