రైతులపై ముసలి కన్నీరు మండల అధ్యక్షులు ప్రవీణ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పంట నష్టం పై జరిగిన చర్చను స్వాగతిస్తున్నామని అలాగే రైతులపై నిన్న జరిగిన చర్చపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిది పది సంవత్సరాల నుండి అధికారంలో ఉండి రైతులను నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదని అలాగే రైతులు పంట నష్టపోయి అడిగిన పాపానికి సంకెళ్లు వేసింది మీ ప్రభుత్వం కాదా అన్నదాతలకు ఎప్పటికీ అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మీ ప్రభుత్వ హయాంలో బాలమల్లుపల్లి బస్వాపూర్ గ్రామ రైతులు నష్టపోతే కనీసం పరామర్శించి వారికి నష్టపరిహారం చెల్లించని ప్రభుత్వం మీదని తాము నష్టపోయామని సిరిసిల్ల పట్టణంలో భిక్షాటన చేస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీ ప్రభుత్వం కాదని మీరు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రైవేటు ఫంక్షన్లకు వచ్చిన కేటీఆర్ ఎప్పుడైనా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోయిండా అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే ట్విట్టర్లో ప్రేమ ప్రకటించి వారికి సహాయం అందించలేని ఘనత మీది కాదా అలాగే మీ బావ హరీష్ రావు తన నియోజకవర్గంలో కాలువలు తవ్వి రైతులకు అండగా ఉంటే అలాంటిది నీవు రైతులను పట్టించుకోక కాలువలు పూర్తి చేయని ఘనత నీది అని పంటలకు సరిపడా నీళ్లు తీసుకురాని నువ్వు మాట్లాడడం సరికాదని మీరు చేసిన మోసాలు దోపిడి వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు త్వరలోనే పదివేల రూపాయల సహాయం అందిస్తామని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!