Ramadugu Students Shine in T-SAT Competitions
రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు
రామడుగు, నేటిధాత్రి:
టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
