
చిట్యాల, నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనీ చల్లగరిగ ఉన్నత పాఠశాలలో ఘనంగా 68వ ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలు నిర్వహించారు మండల ఎస్ జి ఎఫ్ చైర్మన్ మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించిన క్రీడాకారుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు క్రీడలు ఆడవలసిందిగా క్రీడాకారులను కోరాడు అండర్ 14 అండర్ 17 విభాగాలలో బాల బాలికలు 450 మంది విద్యార్థులు కబడ్డీ ఖో ఖో వాలీబాల్ క్రీడలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిట్యాల మండల సబ్ ఇన్స్పెక్టర్ షాఖన్ పాల్గొన్నారు ఎస్ జి ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరంగి రమేష్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కవిత కబడ్డీ క్రీడాకారుడు రబ్బాని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం పాష సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు వేల్పుల రాజ్ కుమార్ మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ తెడ్డు స్వరుపరాణి ఫిజికల్ డైరెక్టర్లు బండి ప్రసాద్ సూదం సాంబమూర్తి ఎన్ లింగయ్య జి శ్రీనివాస్ భాస్కర్ సమ్మయ్య శ్రీనివాస్ రెడ్డి వెన్నెల ఉమా రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు