Congress Leaders Extend Financial Help to Deceased Leader’s Family
ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…
కరకగూడo మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడుకొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందినారు కరకగూడెం మండలంలో కాకుండా మంగపేట గోవిందరావుపేట ఏటూర్ నాగారం మండలాలలో అందరికీ సుపరిచితుడు గొప్ప మానవతవాది డ్రైవింగ్ ఫీల్డ్ లో సిద్ధహస్తుడు రాజకీయంలో తుమ్మల నాగేశ్వరరావు వీరఅభిమాని కావడంతో ఇతనిని తుమ్మల అని పేరు పెట్టి పిలుస్తారు. అతనికి భార్య ముగ్గురు కూతుర్లు 10 సంవత్సరాలలోపు ఉన్నారు అందరూ చిన్నపిల్లలు కావడంతో పెద్ద దిక్కు కోల్పోవడంతో అందరూ కన్నీటి పర్వతమయ్యారు దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో పరిస్థితి తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ఎంతో బాధపడుతూ హృదయం చలించిపోయి గుర్తు చేసుకుంటూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 11000/రూపాయలు దశదినకర్మలకు ఆర్థిక సహాయం చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు. పోలబోయిన రామారావు కొమరం తాతారావు చందా నాగేశ్వరరావు గొగ్గలి కృష్ణ పోలే బోయిన కృష్ణారావు పోలే బోయిన సత్యనారాయణ పోలే బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
