మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన మూసివేసి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుండటంతో కార్మికులు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా నాయకులు గొడిసెల దశరథం గారు విచ్చేసి సంఘీభావం తెలియజేయడం జరిగింది, యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో గౌరవ మందకృష్ణ గారి ద్వారా బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మాజ్దూర్ సంఘo జిల్లా అధ్యక్షుడు కమలాకర్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ ఉపాధ్యక్షుడు సగ్గుర్తి ఆనంద రావు కాయితి శ్రీనివాస్ పెంటసత్యం రావుల తిరుపతి ఆసరు ఓదెలు ఎస్ తిరుపతి కాయితి బుచ్చయ్య ఈసారపు శంకర్ కార్మికులు పాల్గొన్నారు