మండలంలో కలకలం రేపుతున్న కంట్రోల్ రైస్.

రేషన్ బియ్యం లో రబ్బర్ బియ్యం అంటూ గ్రామస్తులు ఆందోళన.

వెంటనే స్పందించిన ఎమ్మార్వో.

విచారణ జరిపి పౌష్టికాహారం
అని తేల్చిన ఎన్ పోర్స్ మెంట్ అధికారి నాగరాజు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని లోకిరేవు గ్రామంలో పిడిఎఫ్ బియ్యంతో పాటు సరఫరా అయిన పోర్టీ ఫైడ్ రైస్ (పౌష్టికాహారం) శనివారం లొకిరేవు గ్రామస్తులలో ప్లాస్టిక్ బియ్యం అంటూ, కలకలం రేపాయి. బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లరు.అన్నం వండుకొని తినే ప్రయత్నంచేయగా
రుచి తేడాగా
ఉండడంతో లబ్ధిదారులు
తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న పిడిఎఫ్ బియ్యంతో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోర్టీ ఫైడ్ రైస్ ( పౌష్టికాహారం ) ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. బియ్యం మాదిరి పోలిక ఉండి ఎన్నో పౌష్టిక పోషక పదార్థాలు ఉన్న పోర్టీ ఫైడ్ రైస్ ప్లాస్టిక్ బియ్యంను పోలి ఉండడంతో పాటు అవే లక్షణాలను కలిగి ఉండడం మండలంలోని ప్రజల అనుమానాలకు కారణం అవుతున్నాయి. రేషన్ షాప్ లలో నుండి పిడిఎఫ్ బియ్యాన్ని ఇంటికి తీసుకువెళ్లి వాటిని వండుకొని తింటున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అన్నం వండుకునేందుకు బియ్యాన్ని నీటిలో పోసినప్పుడు పిడిఎఫ్ బియ్యం క్రిందకి వెళ్లి పోర్టీఫైడ్ రైస్ పైకి తేలుతుండడంతో ప్రజలు వాటిని ప్లాస్టిక్ బియ్యంగా భావిస్తున్నారు.ఆ బియ్యంతో వండిన అన్నం జిగుట, జిగుటగా ఉండి తినే సమయంలో పళ్ళ మధ్య ఇరుక్కుంటుండడంతో ప్రజలు వాటి పంపిణీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బియ్యం సరఫరా విషయంలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ప్రజలు పౌష్టికాహారం అయినా కూడా దానిని తినడానికి అపోహ పడుతున్నారు. ఈ బియ్యం
తినడం వల్ల మనుషుల్లో
బిపి,షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్న కూడా అందుకు సంబంధించి ఏమాత్రం అవగాహన లేని ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మండల పరిధిలోని లోకిరేవు గ్రామంలో రేషన్ బియ్యం తీసుకెళ్లి వండుకున్న వజీర్ పాష అనే వ్యక్తి శనివారం బియ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తాను తీసుకెళ్లిన రేషన్ బియ్యంలో రబ్బర్ బియ్యం వచ్చాయని, ఆ బియ్యంతో
వండిన అన్నం తినడానికి ప్రయత్నిస్తే జిగుట, జిగుటగా ఉన్నదని, దానిని గోడకు అంటిస్తే అలాగే అతుక్కుపోతుందని ఆయన’ విలేకరుల ‘ తో తెలిపారు. ఈ విషయమై మండల తహసిల్దార్ మల్లికార్జున రావును వివరణ కోరగా పిడిఎఫ్ బియ్యంలో పోర్టీ ఫైడ్ రైస్ (పౌష్టికాహారం) సరఫరా అవుతుందని, ఆ ఆహారం భుజించడం వల్ల ఎలాంటి
హాని ఉండదని తెలిపారు.
ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో మండలంలోని ప్రజలు ఆందోళన
చెందాల్సిన అవసరం లేదని, విషయం నిర్ధారించుకునేందుకు
సంబంధిత అధికారులతో
విచారణ జరిపిస్తామని తెలిపారు.
తహసిల్దార్ మల్లికార్జున రావు వెంటనే ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం అందించి(డి.టీ) డిప్యూటీ తహసిల్దార్ నాగరాజును అక్కడికి పంపి విచారణ జరిపించారు.ఈ విచారణ జరిపిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారి నాగరాజు పిడిఎఫ్ బియ్యంతో సరఫరా అయిన బియ్యం పోర్టీ ఫైడ్ రైస్ (పౌష్టికాహారం) అని లోకిరేవు గ్రామస్తులకు తేల్చి వేశారు. దీంతో గ్రామస్తులలో ఉన్న అనుమానం సుకంతం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!