
AITUC Deputy General Secretary Sammayya, Central Secretary Akbar Ali
సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…
ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.