
accidentally falling from train
ప్రమాదవశాత్తు రైలు నుండి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాదాసు తరుణ్ హైదరాబాద్ వెళ్లి మంచిర్యాల కు తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ నుండి బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి త్రీవ గాయాలు అయినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు.వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సివుంది.