మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..
నర్సంపేట నేటిధాత్రి:
మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.