నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్. – ముఖ్యఅతిథిగా విచ్చేసిన వేములవాడ ఏ. ఎస్. పి. శేషాద్రిని రెడ్డి.

చందుర్తి, నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు బంటు రవి కల్పన వారి ఇల్లు కూలిపోవడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం అవడంతో అది తెలుసుకున్న మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ – దుబాయ్ గ్రూపు సభ్యులు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ తరఫున వారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20 వేల రూపాయలను వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి మరియు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ దుబాయ్ వారు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ…… వారు ఇంతకుముందు మల్యాల గ్రామానికి బాడీ ఫ్రీజర్ను అందించారు అని, బంటు నందు అనే అతను అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి 20వేల రూపాయలు అందజేశారు, గతంలో కీర్తి (మేర) వెంకటేష్ అనే అతని ఇంటి రేకులు గాలికి వానకు ఎగిరిపోతే వారి కుటుంబానికి 15000 సాయం అందజేశారు అలాగే మల్యాల గ్రామానికి సైన్ బోర్డులు 30000 రూపాయలతోని ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టించారు అలాగే ఎల్ల రమేష్ అని యువకుడికి గతంలో యాక్సిడెంట్ అయితే అతనికి 10000 రూపాయలు అందజేశారు, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ బాగా లేకపోతే వాటికి సుమారు 65 వేల రూపాయలతో రేనోవేషన్ పని చేపిస్తున్నారు అని అన్నారు. ఈ దుబాయ్ గ్రూపు వారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు, ఇటి కార్యక్రమంలో మల్యాల దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూప్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!