పట్టభద్రుల గళాన్ని చట్టసభల్లో వినిపించండి.
హన్మకొండ :వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక గ్రామంలో’ని పట్టభద్రుల’తో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్ఛునూరి కిషన్ మాట్లాడుతూ
మే 27,న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల, పట్టభద్రుల, ప్రజా గొంతుక, మన అభిమాన నాయకుడు తీన్మార్ మల్లన్న’ను భారీ మేజార్టీతో గెలిపించి మన గళాన్ని చట్టసభల్లో వినబడలంటే ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఉండాలి అని నెల రోజులు మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తూ, మిగితా నాలుగు సంవత్సరాలు మీ గొంతుకగా, మీలో ఒక్కడిగా మీ సమస్యల సాధనకై, పట్టభద్రుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడని హామీ ఇస్తున్నాం. కావున మీరందరూ మల్లన్న గెలుపులో కీలక పాత్ర పోషించాలన్నారు.
అనంతం పేరూరు ఎస్.ఐ రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా’తో సన్మానించి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ వంతు సహకారం కావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో..బొల్లె రమేష్, మత్యబోయిన ప్రసాద్, గౌరారపు సర్వేశ్వరుని రావు, కర్రి సంతోష్, ఏలేటి రవికుమార్, విక్రమ్, విద్యాసాగర్, దేవా, అశోక్, రాజాబాబు, నాగేశ్వరరావు, బార్గవచారి, జనార్ధన్ రావు, రాము, సంతీష్, వెంకటేష్, శ్రీకాంత్, శివకుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు.