
MLA
మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరకద్ర /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్ కుమారుడు సల్మాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.