బిజెపి జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో
నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన హైదరాబాదులో జరిగే అమిత్ షా బూత్ కమిటీ ఆ పై స్థాయి వారితో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉన్నదని ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా పనిచేసే మళ్లీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసే బాధ్యత బిజెపి కార్యకర్తల పైన ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా మన నరేంద్ర మోడీ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు చేరవేయాలని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు మండల ఉపాధ్యక్షులు గజనాల రవీందర్ బీజేవైఎం మండల అధ్యక్షులు మైదామ్ శ్రీకాంత్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాయిని శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.