
వామపక్ష పార్టీల నాయకుల పిలుపు
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 12న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా సదస్సును కార్మికులు మేధావులు ప్రజాతంత్ర వాదులు వామపక్ష భావజాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి లు కొరిమి రాజ్ కుమార్ బంద్ సాయిలు పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఏఐటియుసి కొమురయ్య భవన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ సిపిఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిల్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కొమరయ్య భవన్ లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ జిల్లా సదస్సు కు రాష్ట్ర జిల్లా వామపక్ష పార్టీల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనించాలని అన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు ప్రధాని అంబానీలకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతుందని అన్నారు. అట్లాగే మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగ మనుగడకు ప్రమాదమని దేశంలో సి బి ఐ పేర్లతో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నాయకులపై అక్రమ కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందని వివరించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.అలాగే జిల్లా సధస్సు ను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో వామ పక్ష పార్టీ నాయకులు సోతుకు.ప్రవీణ్ కుమార్,క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య, సుధాకర్ రెడ్డి, రాంచేందర్, వేముల శ్రీకాంత్, ఎండి సాబీర్, గొనెలా తిరుపతి, ప్రశాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు