
ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపు.
కారేపల్లి నేటి ధాత్రి
ఈనెల 16వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు కారేపల్లి స్థానిక సిపిఐ కార్యాలయం లో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్చి 10 సంవత్సరాలు పూర్తైఐనా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలనుపరిష్కరించలేదన్నారు. భారత్ వెలిగిపోతుందని,అచ్చాదిన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చినా ఏమీ ఒరగలేదన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని, నేడు ఉద్యోగ కల్పన పడిపోయి,నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామికుల నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోయి ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలిలో భారత్ 111వ స్థానంలో ఉందన్నారు. మానవాభివృద్ధిలో 191 దేశాల్లో ఇండియా 132వ స్థానంలో ఉందని,హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచీ 2023 ప్రకారం 180 దేశాల్లో భారత్ 160 స్థానంలో ఉందన్నారు. బిజెపి నరేంద్రమోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్టస్థాయికి చేరాయిని,2023లో పాలకులు కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారన్నారు. 2019 – 2022 మధ్యకాలంలో 1 శాతంగా ఉన్న బడా కార్పోరేట్ల వాస్తవ ఆదాయం 30 శాతం వృద్ధి చెందగా, పేదల వాస్తవ ఆదాయం 11 శాతం పడిపోయిందని,ధరలను నియంత్రిస్తామని వాగ్ధానం చేసిన బిజెపి ప్రభుత్వ హయాంలోనే ధరలు కనీవినీ ఎరుగని రీతిలో 30 నుండి 56 శాతం వరకు పెరిగాయని ఆయన తెలిపారు. స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారన్నారు. మోడీ విధానాల వల్ల మధ్య తరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా
భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారుమారు చేస్తూ నాలుగు అగ్రకులాల ఆధిపత్యాయాన్ని చలాయించుకోవడానికి చాతూర్ వర్ణ వ్యవస్థను అమలులోకి తెచ్చి అంటరానితనాన్ని పెంచి పోషించాలని కుట్టలో భాగంగా హిందూ రాజ్యస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తుందని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక
అంశాలను ప్రజల దృష్టి నుండి మరల్చడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మతతత్త్వ శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయని, ఈ కార్యక్రమాన్ని ఒక మతం వారు జరుపుకునే కార్యక్రమంగా కాకుండా, ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని రామాంజనేయులు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెరుకూరి నరసయ్య. సిపిఐ కారేపల్లి మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి చింతల హనుమంతు, వంకుడోతు కౌల్య ఇస్లావత్ బాహుసింగ్, నూకల వీరయ్య, ముసుకుల కనకరజ్, అడ్డగుడ రమేష్, తుర్క మల్లేష్, కొండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.