గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకల సుమన్ గారి చెప్పుల గుర్తుపై గణపురం మండలం ప్రజలందరూ, ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తమసొంత జాగిరైనట్టు10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ అరాచకాలను , భారతరాజ్యాంగాన్నిమారుస్తామంటున్న బిజెపి, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బీసీ ఎస్సీ ,ఎస్టీల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుపై ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ నుగెలిపించాలని కోరారు. 93శాతం ఉన్న బీసీ, ఎస్సీ ,ఎస్టీ ప్రజల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని ఏడు శాతం లేనీ వెలమరెడ్డి ఆధిపత్య పార్టీలే బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలనీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు జిల్లా ప్రధాన కార్యదర్శి, కండె రవి ఉపాధ్యక్షులు కోగిల జితేందర్ ,కార్యదర్శి పోనగంటి సతీష్, చెన్నూరి నరసింహ విక్రమ్ ,సాగర్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.