మాజీ తహశీల్దార్ నాగయ్య అరెస్ట్
గుండెపోటుతో ఎంజిఎంలో చేరిక
గోపాల్‌పూర్ భూవివాదం కేసులో ఒక్కొక్కరిగా జైలు బాటపడుతున్నారు. ఈ భూమి కబ్జా విషయంలో ఇటీవలే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాజీ పీఎ అశోక్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపగా గురువారం రాత్రి మాజీ తహశీల్దార్ నాగయ్య, ఆర్‌ఐ ప్రణయ్, విఆర్‌ఎ రాజు, శ్యాంసుందర్‌ను అరెస్టు చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. గోపాల్‌పూర్ భూమికి సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వీరు నకిలీ ధ్రువపత్రాలు తయారుచేసినట్లు తెలసింది. 2010లో ఆర్ ప్రణయ్ అప్పటి విఆర్‌ఎ రాజు (ప్రస్తుతం కాజీపేట విఆర్వో) రిటైర్డు తహశీల్దార్ నాగయ్యలు తాజాగా నకిలీ దస్తావేజులు సృష్టించడంతోపాటు పాత తేదీలతో సంతకాలు చేసినట్లు సమాచారం. వీరిలో శ్యాంప్రసాద్ అనే వ్యక్తి పాత బాండ్‌పేపర్ విక్రయించాడు. దీంతో వీరిపై కేయూ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక
భూకబ్జా విషయంలో అరెస్టు అయిన రిటైర్డు తహశీల్దార్ నాగయ్య గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. తక్షణమే స్పందించిన జైలు అధికారులు ఆయనను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు చికిత్సను అందించారు. అరెస్టు మూలంగా ఒత్తిడికి గురైన రిటైర్డు తహశీల్దార్ నాగయ్యకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది.