సేవే ఎన్ ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రధాన కర్తవ్యం

పందిరి శ్రీనివాస్ అసోసియేషన్ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామం లో ఎన్ఆర్ఐవిఏ ఆధ్వర్యంలో డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మరియు డాక్టర్ దివాకర్ జంధ్యం సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను గురువారం రెడ్ క్రాస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనంలో నిర్వహించారు.ఈ క్యాంప్లో ఉచితంగా రొమ్ము, గర్భసంచి,నోటి,క్యాన్సర్ వైద్య పరీక్షలు,బిపి,షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి,


ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది.అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జెడ్పి ప్రైమరీ స్కూల్‌ లలో హైస్కూల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌,ఒక తరగతి గదికి ఆరు పాఠశాల బెంచీలను, లైబ్రరీ పుస్తకాలను, డెంటల్ కిట్స్ ను పుస్తక మిత్ర ప్రోగ్రామ్ లో భాగంగా అందించారు.అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ
దేశ సేవ లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో ప్రధానంగా ప్రజలు ఆరోగ్య సమస్యల తో భాధ పడుతున్నారని,వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.దివాకర్ జంధ్యం వారి ఆధ్వర్యంలో భవిష్యత్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు సార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, సేవలు అందిస్తున్నామని అన్నారు.వాసవి అసోసియేషన్ వారి సేవలు అభినందనీయమని అన్నారు.త్వరలోనే దామెర ప్రభుత్వ పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారనీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రజినీ, సర్పంచ్ శ్రవణ్య,ఉప సర్పంచ్ కీర్తి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,హింగే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమేష్,మహిపాల్ రెడ్డి,
గ్రామ ప్రజలు,ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీ నాయకులు,అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!