మహమ్మదాపురం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మహిపాల్ రెడ్డి.

మహమ్మదాపురం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మహిపాల్ రెడ్డి.

మక్కల కొనుగోళ్ళు వేగవంతం చేయాలి.

వెంకటాపురం గిర్నిబావి మక్కల కొనుగోలు కేంద్రాల సందర్శన

పిఏసిఎస్ చైర్మన్ ఊరటి మైపాల్ రెడ్డి

దుగ్గొండి, నేటిధాత్రి:

కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వఉన్న మక్కలు
కొనుగోళ్ళు వేగవంతం చేయాలని మహమ్మదాపురం పిఏసిఎస్ చైర్మన్ ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. తాజాగా వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ లుగా కొనసాగిన వారే మరల బాధ్యతలు నిర్వర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మహమ్మదాపురం సొసైటీ చైర్మన్ గా పురిటి మైపాల్ రెడ్డి గురువారం మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సొసైటీ పరిధిలో వెంకటాపురం గిర్నిబావిలలో ఏర్పాటు చేసిన మొక్కల కొనుగోలు కేంద్రాలను మైపాల్ రెడ్డి సందర్శించారు. గత కొన్ని రోజులుగా రైతులు అమ్మకాల కోసం అక్కడే ఉంచిన మొక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మార్క్ పెడ్ జిల్లా మేనేజర్ తో కొనుగోళ్ళు వేగవంతం చేయాలని కోరారు.అలాగే ట్రాన్స్ పోర్ట్ ఇంచార్జీ విష్ణుతో మాట్లాడి వెంకటాపురం, గిర్నిబావి కేంద్రాలకు మూడు లారీల చొప్పున తెప్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ పట్ల అశ్రద్ధ చేయద్దని సంబంధిత అధికారులకు సూచించారు.కొనుగోల కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కల్గించవద్దని నిర్వాహకులకు ఆదేశించారు.పూర్తి మక్కలు కొనుగోలు చేయించే బాధ్యతగా ఉంటామని రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో సొసైటీ సీఈవో రమేష్ డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్,జరుపుల శ్రీను,జంగిలి రవి,రైతు నాయకులు ఎడాకుల ఉమా మహేశ్వర్ రెడ్డి,
సిబ్బంది చింత సాంబయ్య పలువులు రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version