మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన తాజా మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎర్రవెల్లి పామ్ హౌస్ లో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోమనపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఉద్ధమారి మహేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఈ సందర్భంగా సోమనపల్లి మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను కలవడం నా జన్మ ధన్యమైంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి కొన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు వీరుడు సీఎం కేసీఆర్ అలాగే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి రాష్ట్రంలో అనేక అభివృద్ధి పథకాలను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతులకు 24 గంటల కరెంటును అందించిన ఘనత సీఎం కేసీఆర్ ది రైతు బీమా ద్వారా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు చనిపోయిన కుటుంబానికి అందివ్వడం చాలా గొప్ప విషయం ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదు ఇలాంటి సంక్షేమ పథకాలను తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని మహేష్ యాదవ్ కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *